మల్టీస్టారర్‌ లేదట

19 Mar, 2019 00:54 IST|Sakshi
షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌

షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ను పూర్తి స్థాయి మల్టీస్టారర్‌ చిత్రంలో చూపించడానికి దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప్లాన్‌ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. 1952లో వచ్చిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రానికిది రీమేక్‌ అని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్త విని షారుక్, సల్మాన్‌ అభిమానులు ఖుష్‌ అయిపోయారు.

లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే భన్సాలీ లేటెస్ట్‌ చిత్రం మల్టీస్టారర్‌ కాదట. అందులో సల్మాన్‌ ఖాన్‌ సోలో హీరోగా నటిస్తారట. ఇది ఏ సినిమాకీ రీమేక్‌ కాదని, లేటెస్ట్‌ ట్రెండ్‌కు తగ్గట్టు మోడ్రన్‌ లవ్‌స్టోరీగా ఉండబోతోందని టాక్‌. అలాగే ఈ సినిమాకు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌ 2’ (భన్సాలీ – సల్మాన్‌ చిత్రాల్లో ఒకటి)ను వర్కింగ్‌ టైటిల్‌గా ఉంచాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు