కబీర్‌ సింగ్‌ సూపర్‌.. షాహిద్‌ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌!

20 Jun, 2019 19:08 IST|Sakshi

గల్ఫ్‌లో విడుదలైన సినిమా..

పాజిటివ్‌గా కామెంట్‌ చేస్తున్న నెటిజన్లు

ముంబై: తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’  చిత్రం బాలీవుడ్‌లో  ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే, ఒకరోజు ముందే ఈ సినిమా గల్ఫ్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో విడుదలైంది. దీంతో అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని, షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన సినిమా ఇదని కితాబిస్తున్నారు. అయితే, మరికొంతమంది విజయదేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలాగే ఈ సినిమా కూడా చాలావరకు ఉందని, పెద్దగా మార్పులేమీ దర్శకుడు హిందీ వర్షన్‌లో చేయలేదని కామెంట్‌ చేస్తున్నారు. 

ప్రేమలో విఫలమైన ఓ వైద్య విద్యార్థి స్వీయ హననానికి పాల్పడుతూ.. ఏవిధంగా మారిపోయాడు? అతని ప్రేమకథ ఎలా కొలిక్కి వచ్చిందన్న నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆద్యంతం షాహిద్‌ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ కనబరిచి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడని గల్ఫ్‌ సినీ విమర్శకుడు ఉమైర్‌ సంధు ట్వీట్‌ చేశారు. 

ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమలో పడి.. అంతా సజావుగా సాగిపోయే సాధారణ ప్రేమకథ చిత్రం ఇది కాదని, బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఇలాంటి ప్రేమకథా చిత్రాన్ని చూడలేదని, షాహిద్‌ అద్భుతంగా నటన కనబర్చగా.. దర్శకుడు సందీప్‌ వంగా సినిమాను చక్కగా తెరకెక్కించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆ ట్వీట్‌ ఇక్కడ చూడొచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు