షూటింగ్‌లో గాయపడ్డ హీరో

12 Jan, 2020 15:31 IST|Sakshi

తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఇదే జోష్‌లో మరో తెలుగు హిట్‌ సినిమా ‘జెర్సీ’ రీమేక్‌కు ఓకే చెప్పాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరియే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, అమన్‌ గిల్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. ఇక సినిమా షూటింగ్‌లో భాగంగా శుక్రవారం ఛంఢీగఢ్‌లోని మొహాలీ స్టేడియంలో షాహిద్‌ కపూర్‌ క్రికెట్‌ సాధన చేస్తున్నాడు.

ఈ క్రమంలో షాహిద్‌ పెదవికి బంతి బలంగా తగిలింది. దీంతో అతని కింది పెదవి చిట్లిపోయి రక్తం కారింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతనికి కుట్లు వేసి చికిత్సనందించారు. అనంతరం కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకునేందుకు షాహిద్‌, తన భార్య మీరా రాజ్‌పుత్‌తో కలిసి నేడు ముంబైకి తిరిగి వచ్చారు. తనకు తగిలిన గాయం కనిపించకుండా షాహిద్‌ మొహానికి మాస్క్‌ను ధరించాడు. అతనికి గాయమైందని తెలిసి తల్లడిల్లిపోయిన అభిమానులు షాహిద్‌ వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా షాహిద్‌ గాయం కారణంగా ‘జెర్సీ’ షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేయనున్నారని సమాచారం.

చదవండి: దక్షిణాదిలో గొప్ప సినిమాలొస్తున్నాయి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

సినిమా

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం