సినిమా కోసం తాగాల్సి వచ్చింది

12 Apr, 2019 03:40 IST|Sakshi

‘‘కబీర్‌ సింగ్‌ పాత్ర కోసం రోజుకు ఇరవై సిగరెట్లు వరకూ తాగేవాణ్ణి. ఆ దుర్వాసన అంతా పోవడానికి సుమారు రెండు గంటలు స్నానానికి కేటాయించేవాడ్ని’’ అని తెలిపారు షాహిద్‌ కపూర్‌. ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ సినిమాలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు షాహిద్‌ కపూర్‌. తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌కి కూడా దర్శకుడు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలో ప్రేయసి దూరమైన తర్వాత మందు, సిగరెట్లకు బానిస అయిన ప్రేమికుడిగా కనిపిస్తారు షాహిద్‌.

కబీర్‌ సింగ్‌ పాత్ర గురించి షాహిద్‌ మాట్లాడుతూ – ‘‘రీమేక్‌ చేయడం చాలా కష్టం. ఒరిజినల్‌ని కాపీ చేస్తే కుదరదు. ఇక్కడి (నార్త్‌) ప్రేక్షకులకు సూట్‌ అయ్యేలా చేశాం. వ్యక్తిగతంగా పొగ త్రాగడాన్ని నేను అసలు ప్రోత్సహించను. కానీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌ అలా ఉంది. తన బాధను, కోపాన్ని వ్యక్తపరచలేక వాటికి బానిస అవుతాడు. ఆ పాత్ర కోసం రోజుకు 20 సిగరెట్లు వరకూ తాగాను. ఇంటికి వెళ్తే పిల్లలుంటారు కాబట్టి ఆ వాసన పోవడం కోసం 2 గంటలు షవర్‌ చేసి ఇంటికి వెళ్లేవాడ్ని’’ అని పేర్కొన్నారు. ‘కబీర్‌ సింగ్‌’ చిత్రం జూన్‌ 21న రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు