ఈ ఏడాది సెక్సియెస్ట్ మ్యాన్ షాహిద్

14 Dec, 2017 11:14 IST|Sakshi

త్వరలో పద్మావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ ఈ ఏటి సెక్సియెస్ట్ మ్యాన్ గా ఎంపికయ్యాడు. ఈస్టర్న్ ఐ సంస్థ ప్రతీ ఏటా చేసే సర్వేలో ఆసియాలో టాప్ 50 సెక్సియెస్ట్ మ్యాన్ లను ప్రకటిస్తారు. ఈ ఏడు ఈ లిస్ట్ లో షాహిద్ టాప్ లో నిలిచాడు. గత సంవత్సరం నెంబర్ వన్ గా నిలిచిన పాప్ స్టార్ జేన్ మాలిక్ ను మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

రెండో స్థానంలో బాలీవుడ్ మ్యాన్లీ హీరో హృతిక్ రోషన్ నిలువగా, బుల్లితెర నటుడు వివియన్ డీసేన, ఆశిష్ శర్మలు వరుసగా నాలుగు, ఐదు స్థానాలు సాధించారు. పూర్తి లిస్ట్ ను డిసెంబర్ 15న ప్రకటించనున్నట్టు ఈస్టర్న్ ఐ ప్రకటించింది. ఈ ఎంపిక పై స్పందించిన షాహిద్.. అభిమానుల ప్రేమాభిమానల వల్లే ఇది సాధ్యమైందని ట్వీట్ చేశారు. తనకు మద్ధతు తెలిపిన వారికి తనను ఎంపిక చేసిన ఈస్టర్న్ ఐ సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు.

మరిన్ని వార్తలు