తైమూర్‌కు గట్టి పోటీ ఇస్తాడు చూడండి!

1 May, 2019 14:20 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుమారుడు జైన్‌ కపూర్‌తో సరదాగా గడుపుతున్న గూఫీ వీడియోను షేడీబాయ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అమాయకపు చూపులతో.. తండ్రి చెబుతున్న మాటలు వింటూ కెమెరా వైపు చూస్తున్న జైన్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే 24 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ వీడియోను చూసి.. ‘ తండ్రీ, కొడుకులు సూపర్‌ క్యూట్‌. జైన్‌ను చూస్తుంటే తైమూర్‌ అలీఖాన్‌కు కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. ఏదేమైనా ఒక మాట మాత్రం నిజం. మీ కంటే కూడా మీరా అక్క పోలికలే జైన్‌లో ఎక్కువగా కన్పిస్తున్నాయి’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. స్టార్‌కిడ్స్‌లో జైన్‌ టాప్‌లో ఉండటం ఖాయం అంటూ సంబరపడుతున్నారు.

కాగా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం సమయం కేటాయించడంలో షాహిద్‌ కపూర్‌ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహిద్‌ నటించిన కబీర్‌ సింగ్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్‌ 21న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టాలీవుడ్‌ సెన్సేషన్‌ హిట్‌ అర్జున్‌ రెడ్డి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షాహిద్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.

#shadyboys

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు