హిందీ అర్జున్‌ రెడ్డి ప్రేయసిగా..

23 May, 2018 00:44 IST|Sakshi

టాలీవుడ్‌లో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రం ద్వారా షాలినీ పాండే కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తమిళ రీమేక్‌ ‘వర్మ’ ద్వారా విక్రమ్‌ కొడుకు ధృవ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త కథానాయికను తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీటైనా ఇంకా కథానాయికపై క్లారిటీ రాలేదు.

ఇక.. హిందీ రీమేక్‌ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాను సందీప్‌రెడ్డి  వంగానే తెరకెక్కించనుండటం విశేషం. షాహిద్‌ కపూర్‌ హీరో. ఈ సినిమాలో కథానాయికగా తారా సితారియా నటించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా రూపొందుతోన్న ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఇదే తారాకు తొలి సినిమా కావడం విశేషం. 
 

మరిన్ని వార్తలు