నా దృష్టిలో కబీర్‌ సింగ్ సినిమా కాదు: షాహిద్‌

22 Jun, 2020 16:22 IST|Sakshi

ముంబై: అర్జున్‌ రెడ్డి హిందీ రిమేక్‌ కబీర్‌ సింగ్‌ చిత్రం విడుదలై ఆదివారం నాటికి ఏడాది గడిచింది. హిట్‌ అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో షాహిద్‌ కపూర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాలో షూటింగ్‌ సమయంలో సెట్స్‌లోని పలు సన్నివేశాల ఫొటోలు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేశాడు. అంతేగాక అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. (అల.. బాలీవుడ్‌ తెరపైకి!)

‘వివాదాస్పదమైన నా పాత్రను ప్రేమించిన వారందరికీ హృదయపూర్వ ధన్వవాదాలు. ‘కబీర్‌ సింగ్’‌ అనేది నా దృష్టిలో కేవలం సినిమా కాదు. ఇది నిర్భయం.. నిజాయితీ.. బేర్‌.. నిజమైన భావోద్వేగం. విరిగిన హృదయంతో ఆగ్రహంతో ఉండే ప్రేమికుడి మనసును అర్థం చేసుకున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో సరైన తీర్పు కావాల్సిన సమయం అది. ప్రేక్షకులు ఘనవిజయాన్ని ఇచ్చి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ‘కబీర్‌ సింగ్‌’ అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. నిజంగా ఇది ప్రత్యేకమైనది’ అంటూ తన సహ నటి కియరా అద్వానీ, దర్శకుడు సందీప్‌ వంగాలను ట్యాగ్‌ చేసి షేర్‌ చేశాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’)

To all those who gave so much overwhelming love to such a complex, conflicted character. Thank you. #kabirsingh was never just a film to me.. it was an emotional arc that was raw.. bare.. unabashed .. honest .. fearless .. REAL!! In a time where people are quick to judge (others not themselves ) you understood him. You understood our interpretation of the angst of a broken heart. This one will always be special. So so special. And it would just not have been possible without @kiaraaliaadvani , @sandeepreddy.vanga , @muradkhetani and @ashwinvarde @bhushankumar @santha_dop , Payal and so so many others. Thank you all once again. And remember. Keep it real and make it count. Be kind. Be good. Spread positivity. And always believe. 🙌💕👊

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

అదే విధంగా హీరోయిన్‌ కియారా అద్వానీ కూడా కబీర్‌ సింగ్‌ సినిమలో పలు సన్నివేశ ఫొటోలను షేర్‌ చేశారు. డియర్‌ కబీర్‌ సింగ్‌.. హ్యాపీ యానివర్సరీ’’ అంటూ సినిమాలోని తన పాత్ర పేరు ప్రీతి అని సంతకం చేశారు. కాగా తెలుగు అర్జున్‌ రెడ్డి దర్శకుడైన సందీప్‌ వంగా హిందీ కబీర్‌ సింగ్‌కు కూడా దర్శకుడిగా వ్వవహరించాడు. కబీర్‌ సింగ్‌ విడుదల సమయంలో వివాదంలో చిక్కుకున్నప్పటికీ బీ-టౌన్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం షాహిద్‌ క్రిడా నేపథ్యంలో సాగే మరో తెలుగు రిమేక్‌ ‘జెర్సీ’లో నటిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు