షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!

29 Aug, 2019 18:36 IST|Sakshi

బాలీవుడ్‌ హిట్‌ చిత్రం కబీర్‌సింగ్‌.. అందులోని కథానాయకుడు షాహిద్‌కపూర్‌కు ఎలాంటి అవార్డులు రాకపోవచ్చని ప్రముఖ దర్శక నిర్మాత ఫరా ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కబీర్‌సింగ్’ నిలిచింది. షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద సోలో హిట్‌గా రికార్డులు సృష్టించింది. సందీప్‌ వంగా దర్శకత్వంలో తెలుగు సినిమా అర్జున్‌ రెడ్డికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రం విడుదలైనప్పుడు హీరో క్యారెక్టర్‌, బిహేవియర్‌ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫరా ఖాన్‌ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కబీర్‌సింగ్‌ ఎంత ఘన విజయం సాధించినా, షాహిద్‌ నటన ఎంత బాగున్నా ఈ సినిమాకు ఎలాంటి అవార్డు రాకపోవచ్చు. ఎందుకంటే సినిమాకు వసూళ్లతో పాటు విమర్శలు కూడా భారీగానే వచ్చాయి. ఎవరైనా అవార్డు ఇవ్వాలనుకునే వాళ్లు ఈ విమర్శల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కబీర్‌సింగ్‌ చిత్రం విజయం సాధించిన తర్వాత షాహిద్‌కపూర్‌ స్పందిస్తూ ప్రజల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని ఆయన తెలిపారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు