రోహిత్‌ కోచ్‌తో షాహిద్‌ ట్రైనింగ్‌

11 Mar, 2020 19:51 IST|Sakshi

క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా టాలీవుడ్‌లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో అత్యుత్తమ క్రికెటర్‌గా కనిపించడానికి షాహిద్‌ విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యుత్తమ బ్యాటింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించడానికి టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కోచ్‌ దినేష్‌ లాడ్‌ దగ్గర బ్యాట్‌ పట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అతని దగ్గర బ్యాటింగ్‌ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నారు. కేవలం దినేష్‌ లాడ్‌నే కాకుండా రాష్ట్ర స్థాయి రంజీ ట్రోఫీ శిక్షకులు, ఎనిమిది మంది సర్టిఫైడ్‌ శిక్షకులు షాహిద్‌కు శిక్షణ ఇస్తున్నారు.

ఇది వరకు కళాశాల, క్లబ్‌ స్థాయిలో షాహిద్‌కు క్రికెట్‌ ఆడిన అనుభవం ఉండటంతో అది ఈ సినిమాకు కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సగానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హర్యాణాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. హర్యాణాకు చెందిన రాష్ట్ర స్థాయి కోచ్‌లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. షాహిద్‌ కపూర్‌ నటించిన ‘కబీర్‌ సింగ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. కాగా తెలుగు ‘జెర్సీ’లో నేచురల్‌ స్టార్‌ నాని నటించగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నాని క్రికెటర్‌ పాత్రలో ఆకట్టుకున్నారు.

చదవండి: బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా