27వ పడిలో షారుఖ్‌ ఖాన్‌

25 Jun, 2019 15:04 IST|Sakshi

న్యూఢిల్లీ :  అదేంటి షారుఖ్‌ ఖాన్‌ వయస్సు 53 సంవత్సరాలయితే 27సంవత్సరాలు అని చెబుతున్నారని తికమక పడుతున్నారు. అదేనండీ షారుఖ్‌ఖాన్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీకి వచ్చి నేటికి సరిగ్గా 27 ఏళ్లు. నటుడిగా 27 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ బాలీవుడ్‌ బాద్‌ షా.. ఎన్నో మరుపురాని సూపర్‌హిట్‌ చిత్రాలతో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన విశిష్టమైన నటనతో దాదాపు మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న ఫారుఖ్‌ను ఈ సందర్భంగా అభినందిస్తూ.. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున  ట్వీట్ల వర్షం కురిసింది. 

సరిగ్గా ఇదే రోజున (జూన్‌ 25, 1992లో) 'దీవానా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన షారుఖ్‌ఖాన్‌ తన మొదటి సినిమాతోనే 'ఉత్తమ మేల్‌ డెబ్యూ' అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాలో రిషికపూర్‌, దివ్యభారతి లీడ్‌ రోల్స్‌లో నటించగా, షారుఖ్‌ఖాన్‌ రెండో కథానాయకుడి పాత్రను పోషించాడు. మంచి హిట్‌గా నిలిచిన దీవానా షారుఖ్‌ కెరీర్‌లో కీలకంగా నిలిచింది. షారుఖ్‌ 'దిల్‌ ఆప్నా హై' సినిమాను మొదట సైన్‌ చేసినా 'దీవానా ' సినిమా ముందు రిలీజైంది. గతేడాది  'జీరో' సినిమాతో ముందుకు వచ్చిన షారుఖ్‌ఖాన్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. కత్రినా కైఫ్‌, అనుష్కశర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకాలం తన నటనతో ఆకట్టుకొన్న బాలీవుడ్‌ బాద్‌షా మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష