షకీలా బయోపిక్‌ చిత్రంలో ష‌కీలా!

31 Oct, 2018 09:54 IST|Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ షకీలా పేరు మీద బయోపిక్‌ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా పోషిస్తున్నారు. ఈ సినిమాలో షకీలా వ‍్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌. షకీలా అడల్ట్ స్టార్ గా మారడానికి కారణాలు తెరపై చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట.  కాగా ఈ మూవీలో అతిథి పాత్ర‌లో న‌టించ‌వ‌ల‌సిందిగా ష‌కీలాను ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల కోరిన‌ట్లు స‌మాచారం. దీనికి ష‌కీలా అంగీకారం తెలిపిన‌ట్లు తెలుస్తోంది. 

సౌత్ ఇండస్ట్రీలో శృంగార తారగా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు నటి షకీలా. 90వ దశకంలో ఆమె సినిమాలకు యమ క్రేజ్‌ ఉండేది. ఒకానొక దశలో ఆమె సినిమా కలెక్షన్ల ముందు బడా స్లార్ల మూవీల కలెక్షన్లు కూడా వెలవెలబోయేవి. షకీలా మూవీ రీలీజ్‌ అవుతుందంటే చాలు.. వారం రోజుల పాటు బడా హీరోల సినిమాలు వాయిదా పడేవి. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు