నటి షకీలాకు పెళ్లి అయ్యిందా?

5 Feb, 2015 08:01 IST|Sakshi
నటి షకీలాకు పెళ్లి అయ్యిందా?

తమిళసినిమా: నటి షకీలా బుధవారం పెళ్లి చేసుకున్నారంటూ ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్‌లో ఫొటోలు హల్‌చల్ చేశాయి. ఒకప్పుడు తన అందాల ఆరబోత నటనతో మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేశారు షకీలా. ఆమె నటించిన పలు చిత్రాలు తెలుగు, తమిళ భాషలలో అనువాదమై వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న షకీలా 28 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలతో సహా సోషల్ నెట్ వర్కులో ప్రచారం అవడం ఆసక్తి కరంగా మారింది. దీనికి స్పందించిన షకీలా ఆ ప్రచారంలో నిజం లేదన్నారు.

నెట్‌లో ప్రచారం అవుతున్న ఫొటోల్లో తనతో ఉన్న యువకుడు, తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న కథానాయకుడని వివరించారు. అతని వయసు (28) అని, తన వయసు (38)అని, అతను తన తమ్ముడి లాంటివాడని పేర్కొన్నారు. అయినా తనకిప్పుడు పెళ్లి అవసరం ఏముందని ప్రశ్నించారు. పిల్లల కోసం అయినా పెళ్లి చేసుకోవచ్చుగా అని అంటున్నారని తానిప్పుడు పిల్లల్ని కని భూమికి భారం చేయాలా అని అన్నారు. అలాంటి పెళ్లి, పిల్లలు ఆశ తనకు లేదని స్పష్టం చేశారు. ప్రతి నెలా  కొందరు అనాథ బాలలకు కొంత మొత్తాన్ని సాయం చేస్తున్నట్లు షకీలా వెల్లడించారు.