‘రూటు మార్చిన అర్జున్‌ రెడ్డి పిల్ల’

23 Jun, 2019 08:55 IST|Sakshi

చెన్నై : నటి శాలిని పాండే తన రూటు మార్చేసిందా? అవుననే బదులే కోలీవుడ్‌ నుంచి వస్తోంది. ఈ జైపూర్‌ బ్యూటీ నిజంగా లక్కీఅనే చెప్పాలి. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడి నట జీవితాన్ని అర్జున్‌రెడ్డి సినిమా ఒక్కసారిగా మార్చేసింది. ఆ చిత్రంతో వచ్చిన పాపులారిటీ కోలీవుడ్‌ ఎంట్రీకీ పనిచేసింది. ఇక్కడ 100% కాదల్‌ చిత్రంతో తమిళసినిమా పరిశ్రమకు పరిచయం అయినా.. ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. అదే కాదు నడిగైయార్‌ తిలకం(మహానటి) చిత్రం మినహా ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా కోలీవుడ్‌లో విడుదల కాలేదు. నడిగైయార్‌ తిలగం చిత్రంలో శాలినిపాండేది నిమిత్త మాత్రం పాత్రే. ప్రస్తుతం జీవాతో జత కట్టిన గొరిల్లా చిత్రంతో పాటు విజయ్‌ఆంటోనితో అగ్రిసిరగుగళ్, అనుష్కతో కలిసి సైలెన్స్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు చిత్రాలే కోలీవుడ్‌లో నటిగా శాలినిపాండే స్థానాన్ని డిసైడ్‌ చేయాలి. వీటిలో జీవాతో రొమాన్స్‌ చేసిన గొరిల్లా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై శాలినిపాండే చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఆ చిత్రాలను నమ్ముకుంటూనే కొత్తగా అవకాశాల కోసం వేట మొదలెట్టిందని సమాచారం.

ముఖ్యంగా ఈ అమ్మడు నటించింది తక్కువ చిత్రాలే అయినా హోమ్లీ ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు దాన్ని చెరిపేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టేసింది. అంతే కాదు వచ్చే ఏడాది కల్లా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోవాలని కలలు కంటోందట. ఆ కలలను సాకారం చేసుకోవడానికి గ్లామర్‌ ఒక్కటే మార్గం అని భావించిన శాలినిపాండే ఆ దిశగా అడుగులు మొదలెట్టేసింది. ఏకంగా ఈత దుస్తుల్లో ఫొటో షూట్‌ చేయించుకుంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. అవి ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో పాటు పలువురి లైక్స్‌ పొందుతున్నాయి. అలా శాలినిపాండే వార్తల్లో నానుతోంది. రెండు హింది చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు అధిక దృష్టిని కోలీవుడ్‌పైనే సారిస్తోందట. ఎందుకంటే తెలుగులో ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుండడంతో తమిళ సినిమానే నమ్ముకుంటోందని టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!