నా సినిమాలు ఫ్లాప్‌.. అందుకే: నటుడు

14 Jul, 2020 14:15 IST|Sakshi

నా జీవితంలో దుర్భరమైన దశ అదే: శరద్‌ మల్హోత్రా

‘‘నా టీవీ షోలు హిట్‌ అయిన తర్వాత నా మదిలో ఒకటే ఆలోచన మెదిలేది. నెక్ట్స్ షారుక్‌ ఖాన్‌ను నేనే అని భావించేవాడిని. అలా అనుకుని ఫ్రం సిడ్నీ విత్‌ లవ్‌, ఏక్‌ తేరా సాత్‌ అనే రెండు సినిమాల్లో నటించాను. రెండూ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. నా కలలన్నీ కల్లలై పోయాయి. నేను సినిమాలకు పనికిరానా అనే బాధ మనసును కలచివేసింది. నా సినిమాలు ఆడలేదనే నిజాన్ని అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే టీవీ షోలు చేయడం కూడా మానేశాను. నా జీవితంలో అన్నింటికంటే దుర్భరమైన దశ ఏదైనా ఉందంటే ఇదే’’ అంటూ బాలీవుడ్‌ నటుడు శరద్‌ మల్హోత్రా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు. బుల్లితెరపై గుర్తింపు వచ్చిన తర్వాత తాను కూడా షారుక్‌ ఖాన్‌లాగే వెండితెరను ఏలేస్తానని కలలు కన్నట్లు వెల్లడించాడు. (జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను)

సినిమాలు సరిగా ఆడకపోవడంతో  నాలుగేళ్ల పాటు అందరికీ దూరంగా ఉన్నానని, ఆ సమయంలో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి మనసును ప్రశాంతంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. రోజూ ధ్యానం చేయడంతో పాటుగా శారీరక వ్యాయామంపై కూడా దృష్టి సారించి పూర్వ వైభవాన్ని పొందడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు. రెండేళ్ల పాటు అనేక రకాలుగా ప్రయత్నించిన తర్వాత.. తనకు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెర వైపే మళ్లీ అడుగులు వేశానని, అక్కడ తిరిగి తనకు స్వాగతం లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అందరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయని.. ధైర్యంగా పోరాడినపుడే మళ్లీ నిలబడగలుగుతామని చెప్పుకొచ్చాడు. కాగా టీవీ నటుడిగా కెరీర్‌ ఆరంభించిన శరద్‌ మల్హోత్రా కసమ్‌ తేరీ ప్యార్‌ కీ, బనో మేరీ దుల్హన్‌ వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించడంతో పాటు పలు రియాలిటీ షోలలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం సహనటి దివ్యాంక త్రిపాఠితో ప్రేమలో ఉన్న శరద్‌ ఆమెకు బ్రేకప్‌ చెప్పి గతేడాది రిప్సీ భాటియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.(హీరోయిన్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు