హీరోయిన్‌ లుక్‌పై జోకులు

21 Jul, 2018 12:37 IST|Sakshi

బ్యూటీ క్వీన్‌ శ్రద్ధాకపూర్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విలక్షణ నటుడు రాజ్‌కుమార్‌ రావుతో కలిసి ‘స్త్రీ’ అనే చిత్రంలో నటిస్తుండగా.. ఆ మధ్య టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. 90వ దశకంలో దక్షిణ భారతదేశంలో ‘ఓ స్త్రీ రేపు రా’ నేపథ్యంలో బోలెడన్నీ కథలు ప్రచారమైన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్‌తోనే ‘స్త్రీ’ హర్రర్‌ కామెడీగా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా లుక్‌ను రాజ్‌కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రివీల్‌ చేశాడు. ముసుగులో దెయ్యం మాదిరి భయానకంగా శ్రద్ధా లుక్‌ ఉంది. అయితే హాలీవుడ్‌లో నన్‌.. కంజూరింగ్‌-2 లాంటి చిత్రాల్లో ఇలాంటి లుక్‌ను అల్రెడీ చాలా మంది చూసి ఉన్నారు. దీంతో శ్రద్ధా లుక్కును పోలుస్తూ పలువురు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. పలు చిత్రాల్లోనే పోస్టర్లను.. శ్రద్ధా లుక్‌కు అన్వయించి ఫన్‌ పోస్టులు పెడుతున్నారు. కర్ణాటకలో కలకలం రేపిన నలె బా(ఓ స్త్రీ రేపు రా..) ప్రధానాంశంగా అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ సరసన శ్రద్ధా సాహోలో సైతం నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు