బర్త్‌ డేకి ఫస్ట్‌ లుక్‌

5 Mar, 2018 14:37 IST|Sakshi
శర్వానంద్‌-హను చిత్రం ప్రీలుక్‌ పోస్టర్‌

సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో సక్సెస్‌ రేటుతో దూసుకుపోతున్న హీరోల్లో శర్వానంద్‌ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను శర్వా బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేయబోతున్నారు. 

రేపు అంటే మార్చి6 న శర్వానంద్‌ బర్త్‌ డేకి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్లు ఓ పోస్టర్‌ను వదిలాడు. వర్షంలో హీరోయిన్‌ వెళ్తుంటే.. ఆమె వెనకాలే పరిగెత్తే హీరోను చూపించారు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి  శర్వాకి జోడీగా కనిపించబోతోంది. 

విశాల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లిలు నిర్మిస్తున్నారు. శర్వా ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్‌ వినిపిస్తుండగా.. ‘పడి పడి లేచే మనసు’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్త వినిపించింది.

మరిన్ని వార్తలు