నిఖిల్ డైరెక్టర్‌తో శర్వా

9 May, 2017 11:10 IST|Sakshi
నిఖిల్ డైరెక్టర్‌తో శర్వా

స్టార్ హీరోలతో ఢీ అంటే ఢీ అని సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్. వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో టాప్ స్టార్లతో పోటి పడి సక్సెస్ సాధించిన శర్వానంద్, ఈ శుక్రవారం రాధగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ స్క్రీన్ మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న పోలీస్ కథతో అలరించనున్నాడు శర్వా. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరో సినిమాను ఫైనల్ చేశాడు ఈ యంగ్ హీరో.

స్వామి రారా సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ ప్రస్తుతం మరోసారి నిఖిల్ హీరోగా కేశవ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మే మూడో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కేశవ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేశవ తరువాత సుధీర్ వర్మ, శర్వానంద్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే శర్వానంద్‌కు లైన్ వినిపించిన దర్శకుడు ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి