హను మార్క్‌ ప్రేమకథ ‘పడి పడి లేచే మనసు’

10 Oct, 2018 09:46 IST|Sakshi

విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి  పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ టీజర్‌ ను రిలీజ్‌ చేశారు.

టీజర్‌ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్‌ అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.

మరిన్ని వార్తలు