నాకు నేను నచ్చాను

17 Aug, 2019 00:35 IST|Sakshi
సుధీర్‌ వర్మ, శర్వానంద్, పీడీవీ ప్రసాద్‌

– శర్వానంద్‌

‘‘రణరంగం’ విడుదలైన తొలిరోజు మార్నింగ్‌ షోకి డివైడ్‌ టాక్‌ వినిపిస్తోందన్నారు. మ్యాట్నీ షోకి యావరేజ్‌ అన్నారు. సెకండ్‌ షో పడేసరికి ఎబౌ యావరేజ్‌ అనే టాక్‌ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్‌ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా∙చేరువ అవుతుందని నమ్ముతున్నాను’’ అని శర్వానంద్‌ అన్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత గురువారం విడుదలైంది.

చిత్రానికి  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్న చిత్రబృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్‌ అండ్‌ ప్రాపర్‌ యాక్షన్‌ సినిమా ఇవ్వాలని ‘రణరంగం’ సినిమా చేశాను. ఈ విషయంలో 200 శాతం సక్సెస్‌ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన మంచి క్వాలిటీ æఫిల్మ్‌గా ‘రణరంగం’ పేరును చెబుతుంటే హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఇలాంటి మాస్‌ పాత్ర చేయలేదు. నాకు నేను నచ్చాను. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది.

క్లైమాక్స్‌ అలా ఉండకపోతే రెగ్యులర్‌ సినిమాలా ఉండేది. సినిమాలో కల్యాణీకి, నాకు మంచి కెమిస్ట్రీ వర్కవుట్‌ అయింది. మా ఇద్దరి లవ్‌ట్రాక్‌ నా కెరీర్‌లోనే బెస్ట్‌. చిన్న పాత్ర అయినా చేసినందుకు కాజల్‌కి థ్యాంక్స్‌. కలెక్షన్స్‌ గురించి మాట్లాడను. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్‌. రణరంగం నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని అన్నారు. ‘‘విడుదలకు ముందే ఇది శర్వానంద్‌ సినిమా అని చెప్పా. మంచి ఓపెనింగ్స్‌ రావడానికి శర్వానే కారణం. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకాడలేదు.

ఓపెనింగ్‌ ట్రెండ్‌ ఇలానే కొనసాగితే నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అన్నారు సుధీర్‌ వర్మ. ‘‘రాంగ్‌ ఫిగర్లు (వసూళ్లు) చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమాకు తెలుగురాష్ట్రాల్లో తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్‌ వచ్చింది. దాదాపు నాలుగున్నర కోట్ల షేర్‌ వచ్చింది. ఇలానే ప్రేక్షకాదరణ కొనసాగితే భవిష్యత్‌ కలెక్షన్స్‌ బాగుంటాయనుకుంటున్నాం. ఫ్యామిలీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుందంటున్నారు’’ అని పీడీవీ ప్రసాద్‌ అన్నారు. ‘‘విజువల్స్‌ క్వాలిటీగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు దివాకర్‌ మణి. ‘‘జెన్యూన్‌ ఎఫర్ట్‌ పెట్టి సినిమా చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు రాజా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు

నీతోనే...

మిస్‌ బాంబే ఇకలేరు

రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె

ఏజెంట్‌ చాణక్య

జీవితంలో పెళ్లి చేసుకోను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి