విరాళాలు ఇస్తే ప‌బ్లిసిటీ చేయాలా?

20 Apr, 2020 13:20 IST|Sakshi

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో ఓ బాలీవుడ్ న‌టుడు ఇచ్చిన 25 కోట్ల రూపాయల విరాళం మిగతావారిని కించ‌పరిచ‌న‌ట్లు ఉంద‌ని న‌టుడు శ‌త్రుఘ్న‌సిన్హా ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. అంతేకాకుండా అంత భారీ మొత్తం విరాళం ఇవ్వాల‌నుకున్న‌ప్ప‌డు ఇలా అంద‌రికీ తెలిసేలా ప‌బ్లిసిటీ చేయ‌డం ఎందుక‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీని వ‌ల్ల అంత మొత్తం స‌హాయం చేయ‌నివాళ్లని కించ‌ప‌రిన‌ట్లు అవుతుంద‌ని అన్నారు. అయితే ఆ బాలీవుడ్ న‌టుడు ఎవ‌రు అనే పేరును మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయినప్ప‌టికీ శ‌త్రుఘ్న‌సిన్హా చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన‌వేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో శ‌త్రుఘ్న వ్యాఖ్యల‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నీకు ఇవ్వ‌డం చేత‌కాన‌ప్ప‌డు ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ఏంట‌ని దుమ్మెత్తిపోస్తున్నారు.

క‌రోనాపై పోరాటంలో త‌న వంతుగా  హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ సినీ ప్రముఖుడు ఇవ్వనంత విరాళాన్ని ప్రకటించి అక్షయ్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు మరో రూ.3 కోట్ల  ఆర్థిక సహాయం చేశాడు. దీంతో శ‌త్రుఘ్న‌సిన్హా అక్ష‌య్‌నే టార్గెట్ చేశారంటూ ఆయ‌నపై నెటిజ‌న్లు, బాలీవుడ్ ప్ర‌ముఖులు సైతం విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  దీనిపై శ‌త్రుఘ్నసిన్హా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. `నేను అక్షయ్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా వ్యాఖ్యలను అక్షయ్‌కు ఆపాదిస్తూ కొందరు తీర్పులు చెప్పేస్తున్నారు. అక్షయ్‌ను టార్గెట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. స‌మాజానికి సేవ చేయ‌డంలో అక్ష‌య్ ఎప్ప‌డూ ముందుంటార‌’ని పొగ‌డ్త‌లు కురిపించారు.  అయినప్ప‌టికీ శ‌త్రుఘ్న‌సిన్హాకు వ్య‌తిరేకంగా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు