ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు

10 Apr, 2020 14:11 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్షాపై నటుడు ముఖేష్‌ కన్నా చేసిన వ్యాఖ్యలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ఘాటుగా స్పందించారు. సోనాక్షికి తండ్రిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఇక బిగ్‌బీ హోస్టుగా వ్యవహరించిన ‘కోన్‌ బనేగా కరోడ్‌ పతి’ షోకు అతిథిగా వచ్చిన సోనాక్షి రామాయణాయానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమధానం ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన ఆయన ఆ ఒక్క సమాధానం ఇవ్వనంతా మాత్రాన ఆమెకు హిందు పురాణాలపై అవగాహన లేదని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. కాగా దేశంలో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రామాయణం, మహా భారతం వంటి ఇతిహాసాలను దూరదర్శన్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ముకేష్‌ ఖన్నా స్పందిస్తూ.. రామాయణం, మహాభారతం పునఃప్రసార కార్యక్రమం భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి)

ఇక ముకేష్‌ ఖన్నా వ్యాఖ్యలపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. పరోక్షంగా ముకేష్‌ ఖన్నాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి పేరును ప్రస్తావించకుండా  ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శత్రుఘ్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామాయణంపై అడిగిన ఒక ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉంది. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారు’ అని పరోక్షంగా ముకేష్‌పై విరుచుకుపడ్డారు. (పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు)

అలాగే.. ‘సోనాక్షితో సహా తన ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. సోనాక్షి  కెరీర్‌ను నేను ప్రారంభించాల్సిన అవసరం లేదు. తన సొంత కాళ్లపై నిలబడి స్టార్‌ అయ్యింది. తను కుమార్తెగా ఉన్నందుకు ఏ తండ్రి అయినా గొప్పగా ఫీల్‌ అవుతాడు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదు. ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదు.’ అని ముకేష్‌ మాటలకు ఘాటుగా సమాధానమిచ్చారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్‌’ హీరో)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు