‘దూరమైనా.. స్నేహంగానే ఉన్నాం’

18 Apr, 2020 12:33 IST|Sakshi

'కాన్‌టా లగా' గర్ల్‌ షెఫాలీ జరీవాలా, ‘బాలికా వధు’ సీరియల్‌ ఫేం సిద్ధార్థ్‌ శుక్లా కొంత కాలం డేటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ బిగ్‌బాస్‌-13లో పాల్గొని హౌజ్‌లో అభిమానులను అలరించారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు షెఫాలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మొదట బిగ్‌బాస్‌ హౌజ్‌‌లో మేమిద్దరం గొడవ పడ్డాము. సిద్ధార్థ్‌ సీక్రెట్‌ రూమ్‌కి వెళ్లి వచ్చాక మా మధ్య స్నేహం పెరిగింది. మేమిద్దరం చాలా లాజికల్‌గా ఆలోచిస్తాము. మా అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయి. మేము ట్రావెల్‌, విశ్వం, బుల్లెట్‌ రైళ్లు వంటి పలు విషయాలు గురించి చర్చించుకున్నాం. మేము డేటింగ్‌ చేయటం ఆపేసిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరం స్నేహంగానే ఉండేవాళ్లం’ అని షెఫాలీ చెప్పుకొచ్చారు.

పదేళ్ల క్రితం షెఫాలీ జరీవాలా, సిద్ధార్థ్‌ శుక్లా సహజీవనం చేశారు. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట పలుకారణాలతో విడిపోయారు. కాగా, 2014లో షెఫాలీ.. టీవీ నటుడు పరాగ్‌ త్యాగిని వివాహం చేసుకున్నారు. తాజాగా షెఫాలీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేశారు. దీంతో నెటిజన్లు షెఫాలీ ప్రెగ్నెంట్‌ అయ్యారని పలు కామెంట్లు చేశారు. దీనిపై షెఫాలీ స్పందిస్తూ.. తను ఎక్కువగా ఆహారం తీసుకోవటం వల్ల బొద్దుగా కనిపించాని క్లారిటీ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్‌-13 ట్రోఫీని సిద్ధార్థ్‌ శుక్లా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రూ.40 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును కూడా అతడు సొంతం చేసుకున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు