‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’

26 Mar, 2020 15:09 IST|Sakshi

కరోనా: వీడియో షేర్‌ చేసిన నటి షెఫాలీ షా

ముంబై: కంటికి కనిపించని కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా మొదలు అన్ని దేశాలు గడగడలాడిపోతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్లు విధిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోనూ మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే కొంతమంది మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్చగా రోడ్ల మీద సంచరిస్తున్నారు. మరికొందరు క్వారంటైన్‌లో ఉండటం ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి షెఫాలీ షా గృహ నిర్బంధం వల్ల కాస్త విసుగు వస్తుందని.. కానీ అదే సమయంలో మన మంచి కోసమే ఇదంతా అంటూ నెటిజన్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు.(లాక్‌డౌన్‌: ఒకే ఇంట్లో స్టార్‌ హీరో, మాజీ భార్య)

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షెఫాలీ షా.. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అప్పటి నుంచి కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన టిప్స్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో విరివిగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆమె షేర్‌ చేసిన ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తల చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకున్న షెఫాలీ.. ‘‘క్వారంటైన్‌లో ఉండటం ఇదిగో ఇలాగే ఊపిరిసలపకుండా ఉంటుంది. ఒకవేళ కరోనా వైరస్‌ సోకినట్లయితే మన ఊపిరితిత్తులు కూడా ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి. శ్వాస ఆడదు. మనం నిబంధనలు పాటించకపోతే మనతో పాటు మన ప్రియతములు కూడా శ్వాస తీసుకోలేకపోతారు. కాబట్టి మనకు మరో ఆప్షన్‌ లేదు. మనం, మన కుటుంబాలు బాగుండాలంటే ఇవన్నీ తప్పవు’’అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ఆవశ్యకతను ప్రయోగత్మకంగా వివరించిన షెఫాలీని అభిమానులు ప్రశంసిస్తున్నారు. కాగా రంగీలా, సత్య వంటి సినిమాలతో షెఫాలీ నటిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇక కోవిడ్‌-19 ధాటికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 21 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. (కరోనా: ‘ఆ వ్యక్తి 1100 మందికి అంటించారు’ )

చదవండి: కరోనా: ప్రఖ్యాత చెఫ్‌ మృత్యువాత

కరోనా: 20 వేలు దాటిన మరణాలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా