నేనెవరికీ సలహా ఇవ్వను..

8 Sep, 2018 08:49 IST|Sakshi

శేఖర్‌ కమ్ముల

రాయదుర్గం: సినీరంగంలోకి రమ్మని, చేరమని తాను ఎవరికీ సలహా ఇవ్వనని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. హెచ్‌సీయూలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో సరోజినినాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో శుక్రవారం డాక్టర్‌ సి.వి.ఎస్‌.శర్మ మెమోరియల్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ‘దక్షిణాది చిత్రాల పోకడ– వస్తున్న మార్పులు’ అనే అంశంపై ప్రసంగించారు.

ఆ వివరాలు శేఖర్‌ మాటల్లోనే... ‘సినీ రంగంలో సక్సెస్‌ రేటు కేవలం మూడు శాతం మాత్రమే ఉంటుంది. అందుకే భవిష్యత్తును ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దృఢ నమ్మకం, విజయం సాధిస్తామనే భావన ఉం టేనే ఇటువైపు రావాలి. నా జీవితంలో అదనంగా ప్రమోషన్‌ వర్క్స్‌కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’ అనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం, విజయవాడ నుంచి విద్యార్థులు, శేఖర్‌ కమ్ముల అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి చిత్రపరిశ్రమలో పలు సందేహాలను
నివృత్తి చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు