లవ్వా? పాలిటిక్సా?

10 Nov, 2017 00:52 IST|Sakshi

అవును.. లవ్వా..! పాలిటిక్సా...! దర్శకుడు శేఖర్‌ కమ్ముల హీరో రానాతో లవ్‌స్టోరీ తీస్తారా? లేక మళ్లీ రాజకీయాల్లోకి లాగుతారా? అని ఫిల్మ్‌నగర్‌ కుర్రాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తర్వలో ఓ మూవీ రూపొందనుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లీడర్‌’ ద్వారా రానా హీరోగా పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ సినిమా రానా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే వాటిలో ఒకటవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ‘లీడర్‌–2’ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త వినిపిస్తూ వచ్చింది. త్వరలో ఈ సీక్వెల్‌ షురూ కానుందని సమాచారం.

ఫస్ట్‌ పార్ట్‌లో సీయం అర్జున్‌ప్రసాద్‌గా అద్భుతంగా నటించిన రానా రీసెంట్‌గా తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలోనూ పొలిటీషియన్‌ జోగేంద్ర పాత్రలో రెచ్చిపోయారు. సో.. శేఖర్‌ కమ్ముల ‘లీడర్‌ 2’ని పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తారా? లేకపోతే లీడర్‌ ప్రేమకహానీతో తీస్తారా? అనేది చూడాలి. లేటేస్ట్‌ సెన్సేషన్‌ మూవీ ‘ఫిదా’తో శేఖర్‌ కమ్ముల సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఆయన మళ్లీ లవ్‌స్టోరీనే ఎంచుకుంటారని కొందరి ఊహ. అయితే, ‘లీడర్‌’లో ఆల్రెడీ రానాను పొలిటీషియన్‌గా చూపించారు కాబట్టి, సీక్వెల్‌ బ్యాక్‌డ్రాప్‌ కూడా పాలిటిక్సే అని ఇంకొందరి ఊహ. మరి.. శేఖర్‌ ఊహల్లో ఏ కథ ఉందో?

మరిన్ని వార్తలు