‘జీతే‍ంగే హమ్‌’కు స్టార్‌ నటి‌ సందేశం

27 Apr, 2020 16:39 IST|Sakshi

సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌పై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని బాలీవుడ్ స్టార్‌‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి అభిమానులకు సూచించారు. అంతేగాక వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ సోషల్‌ మీడియాలో సందేశాన్ని పంచుకున్నారు. ఇటీవల వైద్య సిబ్బందిపై జరిగిన దాడులపై అవగాహన కల్పించేందుకు ‘జీతేగా.. ఇండియా జీతేంగే హమ్‌’ అనే నినాదంతో  నటి రవీనా టాండన్‌ సోషల్‌ మీడియాలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి)

వైద్యులపై జరుగుతున్న హింసలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ అవగాహన చర్యల్లో భాగస్వామ్యం కావాలంటూ ఆమె శిల్పాశెట్టిని నామినేట్‌ చేశారు. ఈ క్రమంలో ‘‘మానవత్వాన్ని చూపటానికి మనం చేయగలిగేది ఒక్కటే.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండ పోరాడుతున్న వారి కోసం మన గొంతు కలపడం మాత్రమే’’ అంటూ వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బందిని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. కాగా వారంతా కరోనాపై యుద్ధంలో ప్రథమ పౌరులుగా పోరాడుతున్నారని, అలాంటి వారిపై దాడులు జరపడం సహించరానిదన్నారు. (కరోనా: రవీనా టాండన్‌ పనికి అభిమానుల ఫిదా!)

ఇక ఈ అద్భుత ప్రయత్నానికి తనని నామినేట్‌ చేసిన రవీనాకు శిల్పా ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ గొప్ప ప్రయత్నంలో నన్ను భాగస్వామ‍్యం చేసినందుకు రవీనాకు ధన్యావాదాలు. సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయండి. ఈ విపత్కర కాలంలో మన కోసం పనిచేస్తున్న యోధులకు మద్దతుగా నిలబడదాం. అలాగే మహమ్మారిపై తప్పుడు ప్రచారాలు చేయడం మనేయండి. కరోనాను ఎదుర్కొవడానికి మనమంతా ఐక్యంగా ఉండి పోరాడే సమయం వచ్చింది’’ అంటూ శిల్పా పిలుపునిచ్చారు. అంతేగాక ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తన సోదరి షమితా శెట్టి, దర్శకనిర్మాత ఫరా ఖాన్‌తో పాటు నటుడు అభిమన్యూ దస్సానిలను కూడా నామినేట్ చేశారు. ఇక ‘‘జీతేగా.. ఇండియా జీతే‍ంగే హమ్‌’’ నినాదంతో రవీనా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో శిల్పాశెట్టితో పాటు నటుడు సోను సుద్‌ను కూడా నామినేట్‌ చేశారు. అంతేగాక నటి సోనాలి కులకర్ణి, నిర్మాత ఓనిర్‌ కూడా కార్యక్రమంలో భాగస్వామం కావాలంటూ వారిని ట్యాగ్‌  చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా