మీ టూ కాదు యు టూ!

9 Oct, 2018 05:11 IST|Sakshi
శిల్పాశెట్టి

లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేశాక బాలీవుడ్‌లో ‘మీటూ’ (నేను కూడా) అంటూ చాలామంది తమకెదురైన చేదు అనుభవాలను బయటకు చెబుతున్నారు. ఈ విషయం గురించి బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి మాట్లాడుతూ – ‘‘స్త్రీలందరూ తమ మీద జరిగిన లైంగిక వేధింపులను మీటూ (నేను కూడా) అనే హ్యాష్‌ట్యాగ్‌ మీద సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దానికి బదులుగా ‘యు టూ’ (నువ్వు కూడా) అని ఉపయోగించండి. ఎందుకంటే తప్పు వేధించేవాళ్ల వైపు ఉంది కాబట్టి. ఏ ఇండస్ట్రీలో అయినా ఆడవాళ్లకు పని చేసే వాతావరణం బాగుండాలి. సురక్షితంగా అనిపించాలి. అసలు అదే ముఖ్యమైన కనీస అవసరంగా ఉండాలి. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇన్ని రోజులు బాధపడింది, భయపడింది చాలు, ఇక బయటకు రండి’’ అని వేధింపులకు గురైన ఆడవాళ్లకు ధైర్యం చెప్పారు శిల్పా శెట్టి.

మరిన్ని వార్తలు