టీమిండియా క్రికెటర్ ఇంట్లో హీరోయిన్ సందడి!

24 Jan, 2016 20:48 IST|Sakshi
టీమిండియా క్రికెటర్ ఇంట్లో హీరోయిన్ సందడి!

వడోదర: బాలీవుడ్ నటి సుందరి శిల్పాశెట్టి టీమిండియా క్రికెటర్ ఇంట్లో సందడి చేసింది. శిల్ప గుజరాత్ లోని వడోదరకు ఆదివారం వెళ్లింది. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్ మన్ యూసఫ్ పఠాన్ ను కలుసుకుంది. మిత్రుడు పఠాన్ ఇంటికి వెళ్లాను అని స్నేహితుడితో ఓ ఫొటో అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. యూసఫ్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా గడిపింది. గతంలోనూ యూసప్ కుటుంబసభ్యులను పలుమార్లు ఆమె కలుసుకుంది.

స్నేహితుడి తల్లి ఎంతో అప్యాయతతో తనకు భోజనం పెట్టిందని.. ఆమె ఎంతగానో ప్రేమతో వడ్డిస్తుంటే కాదనలేక అంతా తినేశానని పొడుగుకాళ్ల సుందరి చెప్పింది. యూసఫ్ పఠాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఓ జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్ లు ఆడాడు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ జట్టుకు సహ యజమానిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో శిల్పాశెట్టి ఆ క్రికెటర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జట్టుపై రెండేళ్లపాటు నిషేధం ఉంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి