ముహూర్తం కుదిరింది

28 Nov, 2013 03:25 IST|Sakshi
ముహూర్తం కుదిరింది
నటుడు శింబు, నయనతారల పునర్ కలయికకు ముహూర్తం కుదిరింది. ఈ జంట కలయికను ఇంత విశేషంగా చెప్పుకోవడానికి కారణం తెలియంది కాదు. ఇంతకుముందు నువ్వు లేక నేను లేను అన్నంతగా ప్రేమించుకున్న శింబు, నయనతార ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2006లో వల్లవన్ చిత్రం షూటింగ్ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది. కొన్ని నెలలకే ఆ ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. ఏడేళ్ల తర్వాత ఈ మాజీ ప్రేమికులు కలిసి డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు.
 
  పాండిరాజ్ దర్శకత్వంలో శింబు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ జంట కలయికకు డిసెంబర్ ఐదున ముహూర్తం కుదిరింది. ఆ రోజున వీరిద్దరూ నటించే సన్నివేశాలను దర్శకుడు పాండిరాజ్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోయింది. బయ్యర్లు అప్పుడే చిత్ర కొనుగోలుకు పోటీ పడుతున్నారట. పడరా మరి సంచలనాలకు కేంద్రబిందువు అయిన జంట నటిస్తున్న చిత్రం కదా!
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి