బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

20 Aug, 2019 22:52 IST|Sakshi

నామినేషన్‌ విషయమై బాబా భాస్కర్‌-అలీరెజా చర్చించుకోవడం.. మధ్యలో మహేష్‌ రావడం.. గొడవ పెద్దది కావడం.. ఇక ఇదే విషయమై రాహుల్‌, మహేష్‌, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌లు ముచ్చటించుకోవడం.. రాహుల్‌ తన బాధను చెప్పుకోవడం.. తన ఫ్రెండ్సే తనను నామినేట్‌ చేశారని బాబాతో చెప్పుకోవడం.. అలాంటివన్నీ కామన్‌ అంటూ బాబాతో సరదాగా ముచ్చటించడం.. వరుణ్‌ సందేశ్‌-వితికాల పెళ్లి రోజులను హౌస్‌మేట్స్‌ సెలబ్రేట్‌ చేయడం.. శివజ్యోతి కెప్టెన్‌గా ఎన్నిక కావడం.. పడుకునే సమయంలో బాబా భాస్కర్‌, రవికృష్ణను ఆటపట్టించడం హైలెట్‌గా నిలిచాయి.

తన స్నేహితులే తనను నామినేట్‌ చేశారని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని, టాస్క్‌లో సరిగా పార్టిసిపేట్‌ చేయలేదని కారణాలు చెప్పి ఎనిమిది మంది నామినేట్‌ చేశారని బాబాతో రాహుల్‌ చెప్పుకొచ్చాడు. మొదట్లో అయితే నామినేషన్‌ విషయాన్ని ఈజీగానే తీసుకున్నానని.. కానీ ఇంట్లోకి వచ్చి ముప్పై రోజులు అవుతంది.. ఇప్పుడు తన గురించి ఎవరైనా ఏదైనా చెబితే తీసుకోలేకపోతున్నానని వరుణ్‌తో బాబా చెప్పుకొచ్చాడు. బాబా మాష్టర్‌కు తెలుగు సరిగా రాదు.. అతను చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడని.. తాను చెప్పడానికి వచ్చానని.. తనను ఎవరైనా పుల్లలు పెట్టే వాడు అంటే బాగుండదంటూ మహేష్‌ హెచ్చరించాడు.

ఈ వారం ఇంటి కెప్టెన్సీ బాధ్యతలను మహిళలకే అని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. బజర్‌ మోగిన వెంటనే కన్ఫెషన్‌ రూమ్‌లో ఉండే కుర్చీపై కూర్చొనే మొదటి ఇద్దరికీ టాస్క్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపాడు. దీంతో బజర్‌ మోగిన వెంటనే శివజ్యోతి, వితికా, పునర్నవి, అషూలు పరుగెత్తగా.. శివజ్యోతి, వితికాలు మొదటగా కూర్చున్నారు. తాడు సహాయంతో గాల్లో ఎవరు ఎక్కువ సేపు ఉంటారో వారో తదుపరి ఇంటి కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు. దీంతో వితికాను గాల్లో ఉంచేందుకు తాడును తన నడుమకు కట్టుకుని రాహుల్‌ను ఆమెకు మద్దతు తెలిపాడు. శివజ్యోతికి మద్దతుగా అలీరెజా, రవికృష్ణ తాడును పట్టుకుని కిందకు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. చివరి వరకు గాల్లో ఎవరు ఉంటే వారే ఇంటి కెప్టెన్‌ అవుతారని తెలపగా.. వితికా కొద్ది సమయానికి తన వల్ల కాదంటూ కిందికి దిగిపోయింది. చివరి వరకు అలాగే ఉన్న శివజ్యోతి కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక పడుకునే సమయంలో యో యో అంటూ బాబా భాస్కర్‌ను హౌస్‌మేట్స్‌ ఆటపట్టించారు. పడుకున్న రవిని నిద్రలేపేందుకు జన జుట్టుతో గిలిగింతలు పెడుతూ అషూ ఆటపట్టించింది. ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌.. డ్యాన్స్‌ ప్రోగ్రాంతో సందడిగా మారనుంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి
 

మరిన్ని వార్తలు