ఫుల్‌ స్పీడ్‌

18 Feb, 2019 03:49 IST|Sakshi

మొదటి చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించారు శివ కందుకూరి. ‘పెళ్ళి చూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడే శివ కందుకూరి. ఈరోజు శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త చిత్ర విషయాలను ప్రకటించారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన భరత్‌ ఈ చిత్ర దర్శకుడు. ఈ ప్రేమ కథను నరాల శ్రీనివాస రెడ్డి, పుత్తాకర్‌ రోన్‌ సన్‌ నిర్మించనున్నారు.

ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకొని వేసవి తర్వాత రిలీజ్‌కు రెడీ అవుతోంది. శేష సింధు ఈ చిత్రానికి దర్శకురాలు. ఫస్ట్‌ సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమా అంగీకరించి ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు శివ కందుకూరి. భరత్‌ దర్శకత్వంలో చేసే ప్రేమకథా చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు