సామాజిక బాధ్యతతో శక్తి

19 Mar, 2020 05:59 IST|Sakshi
శివ కార్తికేయన్‌

‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ కీలక పాత్రలు చేశారు. తమిళ్‌లో గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్‌ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్‌ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్‌ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్‌మేన్‌’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్‌మేన్‌’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్‌గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్‌ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు