సేవ చేస్తుంటే కామెంట్లు చేస్తున్నారు!

26 Feb, 2019 00:55 IST|Sakshi
శివాజీరాజా

‘‘మా(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తయింది. ఆర్టిస్టులంతా మరోసారి అధ్యక్షుడిగా ఉండాలని కోరారు. నేను ఉండను.. ఎవరైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్కసారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు...

► నాకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు. 32ఏళ్ల కెరీర్‌లో పరిశ్రమలో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బర్త్‌ డే పార్టీ ఇచ్చాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరుపుకుంటున్నా.

► ‘మా’ అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ సంవత్సరం ఇది. ఏ గొడవలు లేకుండా సంతోషంగా ముందుకు సాగాలి. కష్టాల్లో ఉన్నవారికి సాయపడే తత్వం నాది. ఈ రెండేళ్లలో రకరకాల సేవలు చేసాను. దానిపై కామెంట్లు చేయడం బాధ అనిపించింది. ఈసారి తనీష్, ఖయ్యూమ్‌ లాంటి యువకులు మా ప్యానెల్‌లో పోటీ చేస్తున్నారు. భవిష్యత్‌ తరం బావుండాలనే ప్రయత్నమిది.

► మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో ఎవరైనా పోటీకి దిగొచ్చు. ‘మీ అబ్బాయి హీరోగా కెరీర్‌ మొదలు పెట్టాడు.. హ్యాపీగా ఉండొచ్చు కదా? అంటే.. నా చుట్టూ ఉన్నవారికి మంచి చేసేందుకు ఇలా చేస్తున్నా.

► ఆర్టిస్టులకు గోల్డేజ్‌ హోమ్‌(ఓల్డేజ్‌ హోమ్‌) నిర్మాణం నా డ్రీమ్‌. ఈ హోమ్‌ నిర్మాణానికి హీరో, దర్శకుడు రంగనాథ్‌గారి మరణమే కారణం. ఆయన చివరి రోజుల గురించి అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఓ ఎన్నారై ఆరు ఎకరాల భూమిని దానమిస్తానన్నారు. శంకర్‌పల్లి సమీపంలో పది ఎకరాలు ఇచ్చేందుకు వేరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్‌ చేయాల్సి ఉంది. ‘గోల్డేజ్‌ హోమ్‌’ కోసం ఇప్పటికే కొన్ని విరాళాలు అందాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు