ట్రిక్‌ వర్కౌట్‌ అయ్యింది

19 Aug, 2017 01:13 IST|Sakshi
ట్రిక్‌ వర్కౌట్‌ అయ్యింది

తమిళసినిమా: ప్రతి మనిషికీ లక్కు  ఏదో ఒక సమయంలో, ఏదో విధంగా వరిస్తుంది. కాగా సినిమా వాళ్లిప్పుడు తమను తాము ప్రచారం చేసుకోవడానికి ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు దాటి ఇన్‌స్ట్రాగామ్‌ వాడుకుంటున్నారు. తమ గ్లామర్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి చాలా మందిని వశపరచుకుంటున్నారు. నటి రియాసేన్‌ గుర్తుందా? ఈ బాలీవుడ్‌ నటి అలాంటి ట్రిక్‌తోనే ఒక విమాన అధినేతనే తన వాడిని చేసేసుకుంది.

ఈ బ్యూటీ కోలీవుడ్‌లో తాజ్‌మహల్‌ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసి ఆ తరువాత గుడ్‌లక్, అరసాట్చి చిత్రాల్లో నటించింది. ఇక్కడ తననెవరూ పట్టించుకోకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడా అవకాశాలు సోసో గానే ఉండటంతో పురుషలోకం అదిరిపోయేలా అందాలారబోతతో కూడిన చిత్రాలు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలతో అవకాశాలు వచ్చాయో లేదోగానీ, ఒక ఫ్లైట్‌ అధినేతను పిచ్చపిచ్చగా ఆకర్షించేశాయి.

వ్యాపారంలో బిగ్‌షాట్‌ అయిన శివంతివారి రియాసేన్‌ సెక్సీ ఫొటోలు చూసి ఆమెకు వీరాభిమాని అయిపోయాడట. ఆమెకు ఫోన్‌ చేసి పరిచయం పెంచుకున్నాడు. వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకూ చేరింది. ఈ లవర్స్‌ పెళ్లి ఈ నెలాఖరు గానీ, వచ్చే నెల తొలి వారంలో గానీ జరగనుందట. రియాసేన్‌ సీనియర్‌ బాలీవుడ్‌ నటి మున్‌మున్‌సేన్‌ కూతురన్న విషయం తెలిసిందే. తన కూతురి ప్రేమ గురించి మున్‌ మున్‌సేన్‌ స్పందిస్తూ రియాసేన్‌కు డబ్బు విలువ అస్సలు తెలియదన్నారు. తను చేసే ఖర్చుకు డబ్బున్న భర్త అయితేనే భరించగలడని, ఇప్పుడు బాగా డబ్బున్న వాడినే పెళ్లి చేసుకోబోతోందని అన్నారు.