‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’

30 Jun, 2020 16:20 IST|Sakshi

కరాచీ: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  మరణం పై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఆయన జీవితంలో వచ్చే  సమస్యలు ఎలా ఎదుర్కొవాలో అనే విషయాన్ని తెలియజేయడంతో పాటు సుశాంత్‌ ఆత్మహత్యపై కూడా స్పందించారు. ఈ విషయంపై అక్తర్‌ మాట్లాడుతూ, ‘సుశాంత్‌ మరణం నన్ను కలిచివేసింది. ఒక విషయం నన్ను ఇంకా బాధపడేలా చేసింది. అదేంటంటే నేను సుశాంత్‌ను ముంబైలో కలిశాను. అప్పుడు సుశాంత్‌  పొడుగైన జుట్టుతో ఉన్నాడు. అప్పుడు కొంత మంది అతను ఎంఎస్‌ ధోని సినిమాలో నటిస్తున్నాడని చెప్పారు. అయినప్పటికీ  నేను అతనితో మాట్లాడకుండా వెళ్లిపోయాను. అప్పుడు నేను  సుశాంత్‌తో మాట్లాడి ఉంటే నేను జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను అతనితో పంచుకునే వాడిని. అతనికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది. నేను సుశాంత్‌తో మాట్లాడనందుకు చాలా బాధపడుతున్నాను’ అని తెలిపారు.

(‘సుశాంత్ కోసం త‌న జీవితాన్నే ఇచ్చేసింది’)

ఇంకా అక్తర్‌ మాట్లాడుతూ, మనకి బాధ, డిప్రెషన్‌ ఉన్నప్పుడు మనకి సన్నిహితంగా ఉన్నవారితో పంచుకుంటే కొంత వరకు బయట పడొచ్చని చెప్పారు. హీరోయిన్‌ దీపిక పదుకొనే కూడా  డిప్రెషన్‌, యాంగ్జైటీతో బాధపడేదని, కానీ ఆ విషయాన్ని అందరికి చెప్పి బయట పడిందని తెలిపారు. సుశాంత్‌ కూడా డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటూ, ధైర్యంగా ఉండే తన సన్నిహితులతో  సమస్యలు పంచుకొని ఉండాల్సిందని, అప్పుడు ఇలా జరిగి ఉండేది కాదోమో అని అక్తర్‌ విచారం వ్యక్తం చేశారు.  (సుశాంత్ మ‌ర‌ణం: స‌ల్మాన్ విన్న‌పం)


 

మరిన్ని వార్తలు