ర‌చ‌యిత్రి శోభా డే వివాదాస్ప‌ద ట్వీట్‌

8 Jun, 2020 19:47 IST|Sakshi

సినీ ఇండ‌స్ట్రీలో ఉంటూ, అది కూడా ఓ తెలుగు చిత్రంలో న‌టించిన మీరా చోప్రా.. త‌న‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రో తెలీదంటూ నోరు జారారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ, తీవ్ర దూష‌ణ‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఓ ర‌చ‌యిత్రి కూడా పెద్ద త‌ప్పులో కాలేసి వివాదంలో ఇరుక్కున్నారు.  క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా(39) ఆదివారం గుండెపోటుతో మ‌ర‌ణించ‌గా.. ప‌లువురు సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన‌ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ర‌చ‌యిత్రి శోభా డే కూడా ట్విట‌ర్‌లో ఆయ‌న మృతి ప‌ట్ల‌ సంతాపం తెలిపారు. (‘బహుశా ఇంకో మూడేళ్లే బతుకుతాను’)

‘‌మరో దిగ్గ‌జ న‌టుడిని కోల్పోయాం. ఆయన కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి.." అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనికి చిరంజీవి స‌ర్జా ఫొటోకు బ‌దులుగా మెగాస్టార్ చిరంజీవి ఫొటోను పెట్టి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. దీంతో ఒక్క‌సారిగా షాకైన‌ మెగా అభిమానులు ఆమెపై తీవ్రంగా మండిప‌డుతున్నారు. శోభాడే క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. "ప్రియ‌మైన బాలీవుడ్ సెల‌బ్రిటీలారా.. మీకు మా న‌టీన‌టుల గురించి తెలీక‌పోతే ట్వీట్ చేయ‌కండి.. అంతేకానీ మీ మూర్ఖ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌కండి" అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. "నువ్వు చ‌చ్చిపోయావు, నీకది తెలియ‌ట్లేదు.." అంటూ కొంద‌రు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. త‌న త‌ప్పు తెలుసుకున్న శోభా డే వెంట‌నే స‌ద‌రు ట్వీట్‌ను తొల‌గించారు. (హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం)  

మరిన్ని వార్తలు