దెబ్బకు ట్వీట్‌ డెలిట్‌ చేశాడు!

4 May, 2019 11:36 IST|Sakshi

సినీ ప్రేమికులందరికీ ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్‌లో ఆయన ఇచ్చే రివ్యూలకు, చెప్పే​ బాక్సాఫీస్‌ కలెక్షన్లపై అందరికీ ఎంతో నమ్మకం ఉంటుంది. అయితే ఈ సారి ఆయన చెప్పిన బాక్సాఫీస్‌ లెక్కలు తప్పాయి. అందులోనూ బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తక్కువ చేసి చూపడంతో ఆ చిత్ర నిర్మాత తరణ్‌ ఆదర్శ్‌కు చురకలంటించారు. ఆ దెబ్బతో ఆయన ఆ ట్వీట్‌ను డెలిట్‌ చేసేశాడు.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. ప్రపంచవ్యాప్తంగా అవేంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎండ్‌గేమ్‌ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిందని.. బాహుబలి2 రెండో స్థానంలోకి వెళ్లిందని ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో మరో మూడు, నాలుగు హిందీ సినిమాల పేర్లు ఉన్నాయని తెలిపాడు. అయితే బాహుబలి నిర్మాత అయిన శోభు యార్లగడ్డ ఈ ట్వీట్‌కు స్పందించారు. 

మీరు లిస్ట్‌లో​ చేర్చిన సినిమాలను తక్కువ చేయాలని మాట్లాడటం లేదు.. కానీ మీరు చేసిన పోలిక మాత్రం సరైంది కాదు ఎందుకుంటే బాహుబలి2 అనేది కేవలం హిందీలో డబ్‌ కాగా ఆ చిత్ర వసూళ్లను.. మిగతా చిత్రాలతో ఎలా పోలుస్తారు అంటూ ప్రశ్నించారు. మిగతా సినిమాలన్నీ ఇండియా పాన్‌ సినిమాలని, అన్ని భాషల్లో కలిపి సాధించిన వసూళ్లతో బాహుబలి2ను ఎలా ఒకటిగా పరిగణిస్తారంటూ ట్వీట్‌ చేశారు. దీంతో తరణ్‌ ఆదర్శ్‌ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు.

మరిన్ని వార్తలు