ఆ సినిమా షూటింగ్ కష్టంగా అనిపించింది!

15 May, 2015 10:49 IST|Sakshi
ఆ సినిమా షూటింగ్ కష్టంగా అనిపించింది!

లాస్ ఏంజిల్స్: మ్యాడ్ మ్యాక్స్:ఫ్యూరీ రోడ్.. ఇదో హాలీవుడ్ యాక్షన్ చిత్రం. బ్రిటీష్ నటులు నికోలస్ హాల్ట్, టామ్ హార్డీలు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం కేన్స్ లో జరుగుతున్న 68 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. కాగా, మ్యాడ్ మ్యాక్స్ చిత్రంలో తాను ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర అనుభవాలను నటి కార్లీజీ థెరోన్ వెల్లడించింది  'నేను ఆ చిత్రంలో ఓ దత్త కుమారునికి తల్లిగా నటించాను. ఆ పాత్రలో జాక్సన్ అనే మూడు నెలల బాబును దత్తత తీసుకుని ఆలనా పాలనా చూడాల్సిన పాత్ర. ఈ క్రమంలోనే ఓ రాత్రి ట్రైన్లో షూటింగ్ జరుగుతోంది. ఆ రాత్రంతా బాబు నిద్రపోలేదు. నిజంగా ఆ సమయంలో చిత్ర షూటింగ్  చాలా కష్టంగా అనిపించింది' అని థెరోన్ పేర్కొంది.

 

ఈ చిత్రంలోటైటిల్ రోల్ పాత్రలు పోషించిన నికోలస్ హాల్ట్, టామ్ హార్టీలపై థెరోన్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరిద్దరూ తమ పాత్రల్లో లీనమై నటించడమే కాకుండా.. చాలా గొప్పగా ఆకట్టుకున్నారని పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి