థియేటర్లలో లఘు చిత్రాలు

14 Mar, 2017 01:49 IST|Sakshi
థియేటర్లలో లఘు చిత్రాలు

థియేటర్లలో లఘు చిత్రాల ప్రదర్శన ఇప్పటివరకూ జరగలేదు. అలాంటిది భారతదేశంలోనే తొలిసారిగా ఐదు ఉత్తమ లఘు చిత్రాల ప్రదర్శనకు తమిళనా డులో శ్రీకారం జరిగింది. మూవీ బ ఫ్, ఫస్ట్‌ క్లాప్‌ సంస్థలు సంయుక్తం గా గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన లఘు చిత్రాల పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. 250 లఘు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఐదు లఘు చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ ఐదు లఘు చిత్రాలు ఈ నెల 10 నుంచి ఏప్రి ల్‌ నెల 13వ తేదీ వరకూ తమిళనాడులో ని 150 థియేటర్లలో వారానికి ఒక లఘు చి త్రం చొప్పున క్యూబ్‌ సినిమా నెట్‌వర్క్‌ సంస్థ ప్రదర్శించనుంది.

 కాగా ఈ ఐదు చిత్రాల్లో ఆన్‌లైన్‌ కాంటెస్ట్‌లో అధిక ప్రజాదరణ పొం దిన మూడు చిత్రాల దర్శకులకు నటుడు సూర్య 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నగదు బహుమతులతో పాటు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించనుందని ఈ సంస్థ నిర్వాహకుడు సోమవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో 250 లఘు చిత్రాల్లో ఉత్తమ లఘు చిత్రాలుగా ఎంపికయిన అప్‌లాక్‌ చిత్ర దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్, ఇందనాళ్‌ ఇనియనాళ్‌ చిత్ర దర్శకుడు హహేశ్‌ బాలసుబ్రమణ్యం, అవళ్‌ అళగు చిత్ర దర్శకుడు శ్రీ విజయ్‌గణపతి, థింక్‌ అండ్‌ ఇంక్‌ చిత్ర దర్శకుడు నట్టుదేవ్, ఎన్నంగ సార్‌ ఉంగ చట్టం చిత్ర దర్శకుడు ప్రభు జయరామ్‌లతో పాటు దర్శకుడు జయేంద్ర, క్యూబ్‌ సినిమా నెట్‌వర్క్‌ నిర్వాహకుడు తదితరులు పాల్గొన్నారు.

 యువ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ లఘు చిత్రాల పోటీని నిర్వహించినట్లు మూవీబఫ్, ఫస్ట్‌ క్లాప్‌ సంస్థల నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఉన్నత విద్యను పూర్తి చేసి సినిమాపై ఆసక్తితో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరిగిన తమకు ఈ లఘు చిత్రాల పోటీలు సినీరంగ ప్రవేశానికి మంచి మార్గం అవుతాయన్నారు. ఇప్పటికే తమ లఘు చిత్రాలను థియేటర్లలో చూసిన మిత్రులు, బంధువులు చాలా బాగున్నాయని అభినందిస్తున్నారని పోటీలో ఫైనల్‌కు చేరిన ఐదు లఘు చిత్రాల దర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.