బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

28 Jul, 2019 17:20 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించిన తరువాత కన్నీరు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్‌ హిమజ. సున్నితమైన మనస్తత్వం గల హిమజకు సోషల్‌మీడియాలో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. శ్రీముఖి-హేమ-హిమజ గొడవలో హిమజ కంటతడి పెట్టడం వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మానిటర్‌గా ఉన్న హేమ.. శ్రీముఖిని సేవ్‌ చేసి హిమజను నామినేట్‌ చేసింది. శ్రీముఖి చెప్పిన కారణాలు సైతం సరైనవి కాకపోయినా.. హిమజను కావాలనే టార్గెట్‌ చేశారని చాలా మంది నెటిజన్లు భావించారు. హిమజకు ముందు నుంచీ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఉండటం.. ఇంకా పలువురు సెలబ్రెటీలు హిమజకు మద్దతు పలకడంతో ఎలిమినేషన్‌ నుంచి ఈజీగా బయటపడింది.

ఈసారి పదిహేను మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చే ముందే అంతా సెట్‌ చేసుకుని వచ్చారు. వారికి సంబంధించిన పీఆర్‌ టీమ్‌లు బయట ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. హౌస్‌లో వారు చేసే యాక్టివిటీస్‌ను సోషల్‌ మీడియాలో వదులుతూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. వీటికి తోడు ఆర్మీల గోల ఎక్కువైంది. ప్రతీ కంటెస్టెంట్‌కు ఓ ఆర్మీ తోడైంది. దీంతో ఎవరి డప్పు వారు కొట్టుకున్నట్లు అవుతోంది. అయితే అందరి కంటే భిన్నంగా హిమజకు మాత్రం.. జబర్దస్త్‌ ఫేమ్‌ హైపర్‌ ఆది, శ్రద్దా దాస్‌, స్నేహ, శివబాలాజీ సతీమణి మధుమితలాంటి వారు బహిరంగంగా మద్దతు పలికారు. 

జబర్దస్త్‌ వేదిక మీద ఆదితో కలిసి హిమజ నవ్వులు పూయించడంతో అతను మద్దతు పలికాడు. ఇటీవలె వచ్చిన వినయవిధేయరామ చిత్రంలో రామ్‌ చరణ్‌కు వదినగా హిమజ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో ఏర్పడిన స్నేహంతో నటి స్నేహ హిమజకు మద్దతుగా నిలిచింది. తనకు బిగ్‌బాస్‌ హౌస్‌లో నచ్చిన కంటెస్టెంట్‌ హిమజ అని శ్రద్దాదాస్‌ పేర్కొనడం.. హిమజకు ఓటు వేయాలని మధుమిత కోరడంతో ఓట్ల విషయంలో భారీగా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదుగురి కంటే కంటే హిమజకే ఎక్కువ ఓట్లు పోల్‌ అయినట్లు సమాచారం. తనకు ఏర్పడిన ఈ ఫాలోయింగ్‌ను చివరి వరకు నిలుపుకునేలా హౌస్‌లో హిమజ ఎలాంటి గేమ్‌ ఆడుతుందో చూడాలి.

చదవండి : బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌!
              బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా? 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’