రైట్‌ రైట్‌

8 Jan, 2020 02:26 IST|Sakshi

న్యూ ఇయర్‌ వేడుకలను న్యూయార్క్‌లో ఘనంగా జరుపుకున్నారు హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌. ఆ వేడుకల మూడ్‌కు గుడ్‌బై  చెప్పి వర్క్‌ మోడ్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం జైపూర్‌లో జరుగుతున్న ‘భాగీ 3’ చిత్రీకరణలో శ్రద్ధా పాల్గొంటున్నారు. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో భాగం ‘భాగీ 3’. ఇందులో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటిస్తున్నారు. అహ్మద్‌ ఖాన్‌ దర్శకుడు. జైపూర్‌ రోడ్లపై రైట్‌ రైట్‌ అంటూ స్కూటీపై కంగారుగా శ్రద్ధాకపూర్‌ ఎక్కడికో వెళుతుంటే, బైక్‌పై  టైగర్‌ ష్రాఫ్‌ ఆమెను ఫాలో అయ్యే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో రితేష్‌ దేశ్‌ముఖ్‌ కూడా పాల్గొంటున్నారు.

ఇందులో రితేష్, టైగర్‌ ష్రాఫ్‌ బ్రదర్స్‌లా నటిస్తున్నారు. కాగా, ఓ ఫైట్‌ చిత్రీకరణను కూడా యూనిట్‌ ప్లాన్‌ చేసింది. ‘భాగీ’లో హీరో హీరోయిన్లుగా నటించిన టైగర్‌ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌ మళ్లీ ‘భాగీ 3’లో నటిస్తుండటం విశేషం. అలాగే రెండో భాగంలో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ మూడో భాగంలో అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. మరోవైపు శ్రద్ధాకపూర్‌ నటించిన ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3’ ఈ నెలలో విడుదల
కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

అర్జున్‌.. అను వచ్చేశారు

సినిమా

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి