తిరిగిచ్చేయాలి

2 Jun, 2018 00:57 IST|Sakshi
శ్రద్ధాకపూర్‌

‘‘మనం ధనిక కుటుంబం నుంచి వచ్చామా లేదా సెలబ్రిటీలమా అన్నది కాదు ముఖ్యం. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి’’ అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారామె. ప్రస్తుతం ఓ ఛారిటీలో భాగం అవుతున్నారీ బ్యూటీ.

ఆ విషయం గురించి శ్రద్ధా మాట్లాడుతూ – ‘‘ఈసారి బోలెడన్ని బట్టలు డొనేట్‌ చేయనున్నాను. యాక్టర్‌గా మాకు చాలా కంపెనీల నుంచి బట్టలు వస్తుంటాయి. అందులో మిగిలినవన్నీ నా వంతు సాయంగా డొనేట్‌ చేయనున్నాను. మనందరికీ తిండీ, బట్టా, గూడు వంటి కనీస వసతులున్నాయి అని ఆనందించాలి. అలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో ఎంతో కొంత ప్రేమను పంచాలి’’ అని పేర్కొన్నారామె. శ్రద్ధా ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సాహో’ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు