ఏం గుచ్చుకుందో తెలియదు: శ్రద్ధా కపూర్

20 Oct, 2015 18:31 IST|Sakshi
ఏం గుచ్చుకుందో తెలియదు: శ్రద్ధా కపూర్

నటి శ్రద్ధా కపూర్ కు కొద్ది రోజుల కిందట భయంకరమైన అనుభవం ఎదురైంది. 'రాక్ ఆన్-2' షూటింగ్ లో భాగంగా షిల్లాంగ్ (మేఘాలయ)లో ఉన్న ఆమె హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ సహా సిబ్బందంతా కంగారు పడిపోయారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈలోపు నొప్పి ఎక్కువ కావడంతో ఇక లాభంలేదనుకుని ముంబై పంపేశారు. ఇంతకీ ఏం జరిగిందని అడిగితే..

'షిల్లాంగ్ లో షూటింగ్ చూస్తుంగా.. నా కంట్లో ఏదో గుచ్చుకుంది. అదేమిటో గమనించలేకపోయా. నిమిషాలు గడుస్తుండగానే నొప్పి ఎక్కువైపోయింది. లొకేషన్ లో ఉన్నవాళ్లంతా నా దగ్గరికొచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్.. కనుగుడ్డు స్వల్పంగా చిట్లిందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ముంబై రాక తప్పలేదు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మా ఫ్యామిలీ ఐ స్సెషలిస్ట్ హాస్పిటల్ కు వెళ్లా. రెండు రోజుల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గింది. ఇంకో మూడు రోజులు రెస్ట్ తీసుకుని షిల్లాంగ్ బయలుదేరుతా' అని వివరించింది శ్రధ్ధా కపూర్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి