మార్చిలో శ్రియ పెళ్లి..?

6 Feb, 2018 17:01 IST|Sakshi
హీరోయిన్‌ శ్రియ

సౌత్ లో సీనియర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియ త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌ లో హాట్‌ టాపిక్ గా మారింది. 35 ఏళ్ల వయసులోనూ ఈ జనరేషన్‌ హీరోయిన్‌ లకు గ్లామర్ లో పోటి ఇస్తున్న ఈ భామ సీనియర్‌ హీరోల సరసన నటిస్తూ కెరీర్‌ కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ మార్చిలో పెళ్లికూతురు కానుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తోంది.

ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్‌ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి.  ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్‌ కు చెందిన ఈ భామ డెస్టినేషన్‌ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయిట. అయితే ఈ విషయంపై  శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక సమాచరం లేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా