అప్పుడే ఆ ఆలోచన లేదు

22 Jun, 2018 01:43 IST|Sakshi

రీసెంట్‌గా తన రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొచీవ్‌ని పెళ్లాడిన శ్రియ.. ఫ్యామిలీతో కొంచెం టైమ్‌ స్పెండ్‌ చేసి మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. పెళ్లి చేసుకున్నారు.. మరి అమ్మ ఎప్పుడు అవుతారు? అనే ప్రశ్న శ్రియ ముందుంచితే ‘‘ఇప్పుడే ఆ ఆలోచన లేదు. యాక్చువల్లీ పెళ్లనేది యాక్టింగ్‌కి అడ్డంకిగా మారుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ నా విషయంలో అలా కాదు. మరో 20 సినిమాలు చేసిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తా’’ అని చెప్పారు శ్రియ. పెళ్లికి ముందు శ్రియ కమిట్‌ అయిన తెలుగు, తమిళ బైలింగువల్‌ ‘నరగాసురన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే లేడీ డైరెక్టర్‌ సుజన దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారామె. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.

మరిన్ని వార్తలు