బ్రేకప్‌పై స్పందించిన నటి

9 Oct, 2019 11:33 IST|Sakshi

విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ గారాల తనయ శ్రుతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పని లేదు. ప్రతిభ, అందం శ్రుతి సొంతం. 2009లో హిందీ సినిమా లక్‌తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రుతి ఆ తర్వాత తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్‌గా నిలిచారు. 2017లో వచ్చిన కాటమరాయుడు తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు శ్రుతి. ఆ సమయంలో ఇటాలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సలేతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. లాస్‌ ఏంజెల్స్‌, చెన్నై, ముంబై వంటి చోట్ల పర్యటించారు. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేశారు. కొద్ది సంవత్సరాల పాటు సాగిన వీరి బంధం  ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోకు హాజరయ్యారు శ్రుతి. ఈ సందర్భంగా మైఖేల్‌తో బ్రేక్‌ అప్‌, జీవితం గురించి తన అంచనాలు వంటి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్‌. మైఖేల్‌తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చిందన్నారు శ్రుతి. ‘నేను చాలా అమాయకంగా ఉంటాను. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బాస్‌లా ప్రవర్తిస్తారు. నాలో భావోద్వేగాలు అధికం. అందుకే నా చుట్టు ఉండే వారు నన్ను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే ఇవన్ని కూడా నాకు మంచి అనుభవాలనే మిగిల్చాయి’ అని తెలిపారు. అంతేకాక జీవితంలో సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నాను అన్నారు శ్రుతి.

తను కోరుకున్న లక్షణాలు కల వ్యక్తి తారసపడితే.. వెంటనే అతడితో ప్రేమలో పడతానని.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని తెలిపారు శ్రుతి. అంతేకాక ప్రేమలో పడటానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవన్నారు శ్రుతి. ఒకానొక సమయంలో మంచిగా అనిపించిన ఓ వ్యక్తి అదే సమయంలో చెడ్డగా కనిపిస్తాడని తెలిపారు. ఇలాంటి విషయాల గురించి తాను బాధపడన్నారు. ఇవన్ని తనకు నేర్చుకునే అవకాశం కల్గించాయని.. తనకు మంచి అనుభవాలుగా మిగిలిపోతాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న వీరు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడిపోయిన సంగతి తెలిసిందే. తమ బ్రేకప్‌ విషయాన్ని మైఖల్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు