లక్కీ నంబర్‌ అదే

4 Apr, 2018 00:57 IST|Sakshi

హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ జస్ట్‌ ఇలా పోస్ట్‌ పెడితే చాలు అలా 70 లక్షల మందికి టపీమని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ట్వీటర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ సంఖ్య 7 మిలియన్‌ (70 లక్షలు)కు చేరింది. ఈ నెలలోనే ఆమె ఈ ఫీట్‌ను చేరుకున్నారు. ‘‘నా ట్వీటర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ సపోర్ట్‌కు థ్యాంక్స్‌. మీ అందరి ప్రేమ దక్కడం ఆనందంగా ఉంది. నా లక్కీ నంబర్‌ కూడా సెవెనే’’ అని పేర్కొన్నారు శ్రుతి. మూడేళ్ల క్రితం 30 లక్షల ట్వీటర్‌ ఫాలోయర్స్‌ ఉన్న శ్రుతి స్పీడ్‌గా 7 మిలియన్‌ మార్క్‌ను చేరుకున్నారు.

ట్వీటర్‌లో ఇలా 70 లక్షల ఫాలోయర్స్‌ని సంపాదించుకున్న ఆమె త్వరలో లక్కీ నంబర్‌ పరంగా మరో ఫీట్‌ సాధించనున్నారు. ప్రస్తుతం శ్రుతి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌ సంఖ్య 6.9 మిలియన్లు. అంటే.. 69 లక్షలు. 70 లక్షలకు ఇంకా ఎంతో దూరం లేదు. సో.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 7 మిలియన్‌ మార్క్‌ని టచ్‌ చేసేస్తారన్న మాట.  

మరిన్ని వార్తలు