ష్‌ష్‌ష్‌... సౌండ్‌ చెయ్యొద్దు పొల్యూషన్‌ కూడా!

12 Oct, 2017 00:03 IST|Sakshi

వార్నింగ్‌ కాదు. రిక్వెస్ట్‌ మాత్రమే! ఎందుకీ రిక్వెస్ట్‌... మరో వారం రోజుల్లో దీపావళి కదా! పండక్కి సౌండ్‌ పొల్యూషన్‌ వద్దంటూ శ్రుతీహాసన్, రకుల్‌ప్రీత్‌ సింగ్, పూజా హెగ్డేలు అందరినీ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ‘క్రాకర్స్‌ కాల్చడంలో సరదా ఏముంటుంది?’ అని శ్రుతీ ప్రశ్నిస్తుంటే... ‘దీపావళి పేరుతో చేసే సౌండ్‌ పొల్యూషన్‌ వల్ల చిన్న పిల్లలు, పెద్దలు, మూగ జీవాలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా?’ అనడుగుతున్నారు రకుల్‌. ‘దీపావళి అంటే... ఫెస్టివల్‌ ఆఫ్‌ లైట్స్, నాట్‌ నాయిస్‌’ అనేది పూజ వాయిస్‌.

చిన్నప్పుడు దీపావళికి శ్రుతి క్రాకర్స్‌ కాల్చేవారట. కానీ, పెద్దయ్యాక క్రాకర్స్‌ సౌండ్‌ పొల్యూషన్‌ నచ్చలేదని ఆమె పేర్కొన్నారు. ‘‘దీపావళి స్ఫూర్తిని సెలబ్రేట్‌ చేసుకోవడానికి క్రాకర్స్‌ అవసరం లేదు. కుటుంబమంతా కలసి సరదాగా ఉండొచ్చు. ఇంకా బోలెడు దీపావళి ట్రెడిషన్స్‌ మనకి ఉన్నాయి’’ అన్నారు శ్రుతి.పదవ తరగతిలో ఉన్నప్పుడు బుజ్జి కుక్కపిల్లను రకుల్‌ ఇంటికి తెచ్చుకున్నారట! దీపావళి క్రాకర్స్‌ సౌండ్‌కి బుజ్జి కుక్కపిల్ల పడే ఇబ్బంది చూసి నాలో మార్పు వచ్చిందని రకుల్‌ పేర్కొన్నారు
.
‘‘పండగ అంటే... మన చుట్టుపక్కల్ని చెత్తా చెదారాలతో నింపేసి, సౌండ్‌ చేయడం కాదు. ఎవరూ అలా చేయమని చెప్పరు. క్రాకర్స్‌ కొనే డబ్బులతో ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు. కష్టాల్లో ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అదే అసలైన దీపావళి’’ అన్నారు రకుల్‌.‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి క్రాకర్స్‌ కాల్చడం మానేశా. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవల్సింది ఏంటంటే... మనం పీల్చే గాలినే దీపావళి పేరుతో క్రాకర్స్‌ కాల్చి, కలుషితం చేసేస్తున్నాం. దీపాల పండక్కి నేను దీపాలే వెలిగిస్తా, క్రాకర్స్‌ కాల్చను. మనమంతా నో–క్రాకర్స్‌ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అని పూజా హెగ్డే ప్రజలందర్నీ కోరారు.

మరిన్ని వార్తలు