కష్టపడు.. లేకపోతే ఇంటికెళ్లిపో!

29 Apr, 2018 00:06 IST|Sakshi

‘హాయ్‌.. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తా’ అంటూ ట్వీటర్‌లో తనను ఫాలో అవుతున్నవాళ్లకు మంచి చాన్స్‌ ఇచ్చారు శ్రుతీహాసన్‌. అంతే.. ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చాయి. వాటిలో ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలు–జవాబులు.

► చెన్నైలో మీకు ఇష్టమైన ప్లేస్‌?
మా నాన్న అండ్‌ పియానో ఎక్కడుంటే అది నాకు ఇష్టమైన ప్లేస్‌.

► మీరు ఏ వస్తువు లేకపోతే జీవించలేరు?
ఫోన్‌.

► మిమ్మల్ని బాగా విమర్శించేవారు ఎవరు?
నేనే.

► మీకు నేను (ఫ్యాన్‌) ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు?
నో.. ఐ యామ్‌ సారీ అని చెప్తాను.

► ట్రెడిషనల్‌ ఆర్‌ మోడ్రన్‌ డ్యాన్స్‌. వీటిలో ఏది ఇష్టం?
రెండూ ఇష్టం.

► మీ నాన్నగారు స్థాపించిన పార్టీలో చేరి ప్రజా సేవ చేస్తారా?
నా జ్ఞానం, నా అనుభవం సమాజంలో పాజిటివ్‌ చేంజ్‌ తీసుకురాగలదు అని నేను నమ్మినప్పుడు తప్పకుండా వస్తా.

► మీరు నటించే నెక్ట్స్‌ బాలీవుడ్‌ మూవీ టైటిల్‌ ఏంటి?
ఇంకా డిసైడ్‌ కాలేదు.

► ఏ వస్తువు తయారు చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు?
గన్స్‌.

► క్లాసులు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నప్పుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారా?
అవును.

► ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు?
పెయింటింగ్‌ అండ్‌ రీడింగ్‌.

► మీ మోటివేషన్‌ లైన్‌ ఏంటీ?
కష్టపడు. లేకపోతే ఇంటికెళ్లిపో.

► ప్రపంచంలోనే ఏదైనా చేంజ్‌ చేయగల శక్తి మీకు వస్తే ఏం చేస్తారు?
మహిళలు, చిన్నారులకు హాని చేయాలనుకునే వారి మైండ్‌సెట్‌ను మార్చేస్తా.

► మీరు బ్యాడ్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అందులోంచి బయటకు తీసుకొచ్చేదెవరు?
నా చెల్లెలు అక్షరాహాసన్‌.

► మీ జీవితంలో అద్భుతమైన క్షణాలు?
నా చెల్లి పుట్టినప్పుడు.

► ఆర్టిస్ట్‌ కాకపోయి ఉంటే ఏం చేసేవారు?
మ్యుజిషియన్‌.

► లవ్‌ మ్యారేజ్‌ లేదా అరేంజ్డ్‌ మ్యారేజ్‌. దేన్ని ప్రిఫర్‌ చేస్తారు?
లైఫ్‌లో నాకు అన్నీ అరేంజ్‌ చేయడానికి ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు